ఒకవైపు ‘బాహుబలి’, మరోవైపు ‘రుద్రమదేవి’లాంటి భారీ చిత్రాల్లో నటిస్తూ గత కొన్ని నెలలుగా రానా బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు ఆషామాషీవి కావు. శారీరక శ్రమకు ఆస్కారమున్న పాత్రలు అవి. గత కొన్ని నెలల్లో అడపా దడపా షూటింగ్‌కి కొంత గ్యాప్ వచ్చినా, రానాకి సుదీర్ఘ విరామం అంటూ దొరకలేదు. అది ఇప్పటికి లభించింది. కొన్ని రోజులుగా ‘బాహుబలి’కి సంబంధించిన షెడ్యూల్‌లో పాల్గొన్నారు రానా. ఈ షెడ్యూల్ ముగిసిందని, ఇంకొన్ని నెలల తర్వాతే తదుపరి షెడ్యూల్‌లో పాల్గొననున్నానని రానా చెప్పారు. తను అంగీకరించిన కొత్త చిత్రం జూన్‌లో ప్రారంభం కానుంది. సో... దాదాపు నెల రోజుల పాటు రానాకి వేసవి సెలవులు దొరికినట్లే.
Post a Comment