హన్సిక అవుట్... రకుల్ ఇన్!
ఒకరికి చేదు వార్త... మరొకరికి తీపి వార్త. చేదువార్త హన్సికదైతే, తీపి వార్త రకుల్ ప్రీత్‌సింగ్‌ది. రామ్ హీరోగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందనున్న ‘పండగ చేస్కో’ చిత్రంలో హన్సికను కథానాయికగా అనుకున్నారు. రామ్-హన్సిక అంతకుముందు మస్కా, కందిరీగ చిత్రాల్లో కలిసి చేశారు. హన్సిక తమిళంలో బిజీ కావడంతో ‘పండగ చేస్కో’కి డేట్లు కేటాయించలేని పరిస్థితి ఏర్పడిందట. దాంతో ఆ అవకాశం రకుల్‌కి దక్కింది. ఇప్పటికే గోపీచంద్ పక్కన ఓ సినిమా చేస్తోన్న రకుల్... రామ్ పక్కన నటించే అవకాశం రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారట. ‘పండగ చేస్కో’ చిత్రం ఈ నెల 17న ప్రారంభం కానుంది.

Post a Comment

 
Top