తారలు దిగి వచ్చిన వేళ... మల్లెలు నడిచొచ్చిన వేళ... అన్నట్టుగా ఆదివారం రాత్రి చెన్నైలోని ఓ ప్రై వేట్ హోటల్‌లో దక్షిణాది అగ్రశ్రేణి కథానాయికలంతా సందడి చేశారు. రమ్యకృష్ణ, నయనతార, త్రిష, అమలాపాల్... ఇలా ఈ అందాల తారలందరూ కలిసి పండగ చేసుకున్నారు. ఈ పండగకు ముఖ్య కారకురాలు త్రిష. ఆదివారం తన పుట్టినరోజు. ఈ వేడుకను అత్యంత సన్నిహితుల మధ్య జరుపుకున్నారామె. ఒకప్పుడు నయనతార, త్రిష మధ్య మనస్పర్థలున్నప్పటికీ ఆ తర్వాత స్నేహితులయ్యారు. రమ్యకృష్ణ, త్రిష ఎప్పట్నుంచో క్లోజ్‌ఫ్రెండ్స్. ఇక అమలాపాల్, నికిషా పటేల్.. ఇలా త్రిష స్నేహితుల జాబితాలో చాలామందే ఉన్నారు. వీళ్లల్లో త్రిష బర్త్‌డే పార్టీకి చాలామంది హాజరయ్యారు. వాళ్లతో కలిసి బర్త్‌డే బేబీ త్రిష ఫొటోలు దిగారు.
Post a Comment