View Namitha Gallery |
నమిత అనగానే బొద్దయిన తన రూపమే గుర్తుకొస్తుంది. జెమిని నుంచి సింహా వరకు పలు తెలుగు సినిమాల్లో నటించిన ఈ భామ ఆ మధ్య ఎక్కువగా తమిళంపైనే కాన్ సెన్ ట్రేషన్ చేసింది. ఇటీవల షూటింగ్ కు గ్యాప్ తీసుకున్న ఈ సూరత్ సుందరి బాక్సింగ్ లో పూర్తి స్థాయి శిక్షణ తీసుకుంటోంది. నేషనల్ బాక్సింగ్ చాంపియన్ తులసి ఈమెకు శిక్షణనిస్తోంది. బాక్సింగ్ శిక్షణ తీసుకోవడం కేవలం తను ఫిట్ గా ఉండటానికేనట.
తన తదుపరి సినిమా నిమిత్తం ఈ పని చేయడం లేదట.నమిత మాట్లాడుతూ ``నేను ఫిట్ గా ఉండటానికే బాక్సింగ్ నేర్చుకుంటున్నాను. నేను నటించే ద్విభాషా చిత్రం ఈ నెల్లోనే మొదలు కావాల్సింది. కానీ దాని ప్రారంభంలో కాస్త ఆలస్యం జరుగుతోంది. అంతలో బాక్సింగ్ నేర్చకుందామనిపించింది. అందుకే గత మూడు నెలలుగా నేర్చుకుంటున్నాను. నేను నటించబోయే సినిమా మహిళా ప్రాధాన్యత గల సినిమా`` అని చెప్పింది నమిత.
Post a Comment