రజనీ సాంకేతిక ప్రయాణం మొదలైంది!
 ‘నేనొక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు...’ అని ‘నరసింహా’ సినిమాలో రజనీకాంత్ చెప్పిన డైలాగుని మర్చిపోవడం అంత సులువు కాదు. ఈ సినిమా విడుదలై పదిహేనేళ్లయినా ఆ నోటా ఈ నోటా  ఇప్పటికీ ఈ డైలాగు వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు దీన్ని గుర్తు చేయడానికి కారణం ఉంది. సాంకేతిక మాధ్యమం ట్విట్టర్‌లో రజనీకాంత్ ఖాతా ఆరంభించారు. ‘‘ఆ దేవుడికి నా ప్రణామములు. అందరికీ నమస్కారం. నా అభిమానులందరికీ ధన్యవాదాలు. ఈ సాంకేతిక ప్రయాణం ఆరంభించడం ఎంతో ఉద్వేగంగా ఉంది’’ అని తొలి ట్వీట్‌ని పోస్ట్ చేశారు రజనీ. ఆ తర్వాత రెండు మూడు గంటల వరకు మరో ట్వీట్‌ని పొందుపరచలేదు. అఫ్‌కోర్స్... రజనీ ఒక్క ట్వీట్ చేస్తే వంద ట్వీట్స్‌తో సమానం అని అభిమానులు ఆనందపడిపోతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ట్విట్టర్‌లోకి అడుగుపెట్టిన రెండు గంటల లోపు దాదాపు 71వేల మంది ఫాలోయర్స్ చేరడం విశేషం. సూపర్ స్టార్‌కున్న ఫాలోయింగ్‌కి ఇదో నిదర్శనం.
 

Post a Comment

 
Top