అదిగో వస్తోంది ఇదిగో వస్తోంది అని ఇన్నాళ్లూ ఊరించిన విక్రమసింహ సినిమా వాయిదాపడింది. ఈ నెల 9న విడుదల కావాల్సిన ఈ సినిమాను ఈ నెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రజనీకాంత్, దీపికాపదుకునే జంటగా మోషన్ కేప్చర్ విధానం ద్వారా తెరకెక్కించిన సినిమా ఇది. రజనీకాంత్ తనయ సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. ఎ.ఆర్.రెహమాన్ స్వరాలను సమకూర్చారు.
ఈ సినిమా విడుదల తేదీని మే 9గా ప్రకటించారు. దీనికి సంబంధించి సర్వత్రా యాడ్ లు కూడా ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో విడుదలను వాయిదా వేశారు. వాయిదాకు కారణాలు ఏమిటన్నది అధికారికంగా మరికాసేపట్లో తెలియజేస్తారు. రజనీకాంత్ ట్విట్టర్ లో అంతర్జాతీయంగా ఆరో సెలబ్రిటీగా ప్రతిష్టను సంపాదించుకున్న ఈ తరుణంలో ఆయన సినిమా చెప్పిన తేదీకి విడుదల కాకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశను కలుగజేస్తోంది.
Post a Comment