రాహుల్, చిన్మయి ఒక్కటయ్యారు!
వర్ధమాన నటుడు రాహుల్ రవీంద్రన్ తో గాయని చిన్మయి శ్రీపాద వివాహం సోమవారం చెన్నైలో దక్షిణ భారత సాంప్రదాయ పద్దతిలో జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
 
గత కొద్ది రోజులుగా రాహుల్, చిన్మయిలు ప్రేమించుకుంటున్నారనే వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. 
 
తమిళంలో వణక్కం చెన్నై, తెలుగులో అందాల రాక్షసి చిత్రాలతో రాహుల్ గుర్తింపు తెచ్చుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన చిన్మయి.. సమంత, సమీరారెడ్డి, కాజల్ అగర్వాల్, నీతూ చంద్రలకు గాత్రదానం చేశారు.
 
చెన్నై ఎక్స్ ప్రెస్ లో 'తిత్లీ', మస్త మగన్ '2 స్టేట్స్' చిత్రంలోని పాటలు చిన్మయికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి. 

Post a Comment

 
Top